రవితేజ కథానాయకుడిగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందను న్న ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే ఖరారైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఈ భామ సంప్రదాయ పరికిణీ ఓణీలో అందంగా కనిపిస్తున్నది. హరీశ్‌శంకర్ సినిమాల్లో కథానాయి కల పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో కూడా నాయకానాయికల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేయనున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: హరీశ్‌శంకర్. రవితేజ-హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది.