Skip to main content

Namaste NRI

భైరవం ఫస్ట్ సింగిల్ వెన్నెల వచ్చేస్తుంది

బెల్లకొండ సాయిశ్రీనివాస్‌, నారా రోహిత్‌, మంచు మనోజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భైరవం. అతిథి శంకర్‌ కథానాయిక.   విజయ్‌ కనకమేడల దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టబోతున్నారు. ఈ నెల 3న బెల్లంకొండ శ్రీనివాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఓ వెన్నెల  అంటూ సాగే గీతాన్ని విడుదల చేస్తున్నారు. మంగళవారం పాట తాలూకు పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. హుషారుగా సాగే ప్రేమ గీతంగా మెప్పిస్తుందని, నాయకానాయికల నృత్యాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌ కనకమేడల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events