Skip to main content

Namaste NRI

రియాలిటీ నుంచి.. భజ గోవిందం సాంగ్ రిలీజ్

హీరో కిరణ్‌ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం రియాలిటీ. దేవిక భట్‌ కథానాయిక. సుధాకర్‌ చాగంటి దర్శకుడు. ఈ సందర్భంగా ఈ సినిమా సంగీత ప్రయాణాన్ని మేకర్స్‌ ప్రారంభించారు. ఈ సినిమాలోని తొలిపాట భజ గోవిందం ను విడుదల చేశారు. భజగోవిందం.. భజగోవిందం.. బ్రతుకే కోలాహలం.. భజగోవిందం.. భజగోవిందం.. బరువే కాదే క్షణం అంటూ భక్తిభావంతో కథకు అద్దంపట్టేలా ఈ పాట సాగింది.

సనారే రాసిన ఈ పాటను భీమ్స్‌ సిసిరోలియో స్వరపరచగా, వైకోమ్‌ విజయలక్ష్మి ఆలపించారు. పనిని ప్రేమించడం, స్వశక్తితో ఎదగడం ఎంత ముఖ్యమో ఈ పాట చెబుతున్నది. పాటకు తగ్గట్టుగా విజువల్స్‌ కూడా సాగాయి. హోటల్‌ నడుపుతూ, కుటుంబ సభ్యులతో విలువైన క్షణాలను గడుపుతున్న హీరోగా కిరణ్‌ అబ్బవరాన్ని ఈ పాటలో చూడొచ్చు. శరత్‌కుమార్‌, సాయికుమార్‌, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శనం తదితరులు ఇతరపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: విశ్వాస్‌ డేనియల్‌, సహనిర్మాత: సురేశ్‌ యెర్రా, నిర్మాణం: జాయ్‌ ఫిల్మ్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events