Namaste NRI

గార్గీ తో అవార్డు దక్కించుకున్న భామ

సౌత్‌ లో మనకున్న టాలెంటెడ్‌ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. లేడీ పవర్‌స్టార్‌ అంటూ అభిమానులు పేరు పెట్టుకున్నారు. ఆ పేరుకు తగ్గట్టే ఆమె నిరూపించుకుంటోంది. తాజాగా ముంబైలో జరిగిన క్రిటిక్స్‌ ఛాయిస్ అవార్డ్సు-2023  ఈవెంట్‌కు సాయిపల్లవి హాజరైంది. గార్గి సినిమాకుగాను ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ కార్యక్రమంలో ఎరుపు రంగు చీరలో మెరిసిపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సాయిపల్లవి. ఈవెంట్‌ ముగిసిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో సాయిపల్లవి తనతో సెల్ఫీ, ఫొటోలు దిగేందుకు వచ్చిన అభిమానులతో కెమెరాకు ఫోజులిచ్చింది.  గతేడాది తెలుగులో విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతోపాటు తమిళంలో లీగల్‌ డ్రామాగా తెరకెక్కిన గార్గిలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. సాయిపల్లవి ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్‌డేట్ రావాల్సి ఉంది.





Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events