గూగుల్ క్లౌడ్ జపాన్, ఆసియా పసిఫిక్ ప్రాంతాల కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ విభాగ వైస్ ప్రెసిడెంట్‌గా భానుమూర్తి బల్లాపురం నియమితులయ్యారు. విప్రో మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) అయిన భానుమూర్తి అమెరికాలోని గూగుల్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ విభాగ వైస్ ప్రెసిడెంట్ జాన్ జెస్టెర్‌కు రిపోర్ట్ చేయనున్నారు. ఎన్‌ఐటీ వరంగల్ నుంచి బీ.టెక్ (మెకానికల్), ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన భానుమూర్తికి ఐటీ సేవల రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
గతంలో ఈయన విప్రో అధ్యక్షుడు, సీవోవో గానూ పనిచేసిన విషయం తెలిసిందే. అక్కడ ఈ ఏడాది జూలైలో రిటైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గూగుల్ క్లౌడ్ లీడర్ షిప్ టీంలో చేరారు. ఐఐఎం అహ్మదాబాద్‌లోనూ విద్యనభ్యసించిన భానుమూర్తికి ఐటీ రంగంలో 25 ఏండ్లకు పైగా అనుభవం ఎన్నో సంస్థల్లో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో పనిచేశారు. గ్లోబల్ ఫార్చూన్ 500 కస్టమర్స్‌కూ సేవలందించారు. మా ప్రాంతీయ నాయకత్వంలో భానుమూర్తి భాగస్వామి కానున్నారని గూగుల్ తెలిపింది.