Namaste NRI

ప్రతీకారంతో భన్వర్‌సింగ్‌ షెకావత్‌

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం పుష్ప-2. ఈ చిత్రం   ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్నది. మారేడుమిల్లి పరిసర ప్రాంతంలో ముఖ్య ఘట్టాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను చిత్ర బృందం వెల్లడించింది. ఫహద్‌ ఫాజిల్‌కు సంబంధించిన సన్నివేశాల్ని తాజా షెడ్యూల్‌లో పూర్తి చేశామని పేర్కొంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుకుమార్‌, ఫహద్‌ ఫాజిల్‌ సెట్‌లో ఉన్న వర్కింగ్‌ స్టిల్‌ను విడుదల చేశారు. దీనికి ఈ సారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి రాబోతున్నాడు అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్నందిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నది.

పుష్ప చిత్రంలో మలయాళ అగ్ర నటుడు ఫహద్‌ ఫాజిల్‌ పోషించిన పోలీసాఫీసర్‌ భన్వర్‌సింగ్‌ షెకావత్‌ పాత్ర అందరికి గుర్తుండిపోయింది. పార్టీ లేదా పుష్ప అంటూ ఆయన పలికిన డైలాగ్‌ చాలా పాపులర్‌ అయింది. పుష్ప-2 లో కూడా ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర కీలకంగా ఉండబోతున్నదని తెలిసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events