Skip to main content

Namaste NRI

భరతనాట్యం కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది: ఆనంద్ దేవరకొండ

సూర్యతేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా రూపొందిన చిత్రం భరతనాట్యం. ఈ చిత్రానికి కేవీఆర్‌ మహేంద్ర దర్శకుడు. పాయల్‌ సరాఫ్‌ నిర్మాత.  భరతనాట్యం’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఆనంద్‌ దేవరకొండ  అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దర్శకుడు కేవీఆర్‌ మహేంద్రకూ, నాకూ, శివాత్మికకు డెబ్యూ మూవీ దొరసాని. ఆ సినిమా మా ముగ్గురికీ మంచి పేరు తెచ్చింది. మహేంద్ర రెండవ సినిమా అయిన ఈ భరతనాట్యం కూడా నటించిన అందరికీ మంచి పేరు తీసుకురావాలి. నాకిష్టమైన క్రైమ్‌ కామెడీ జానర్‌లో ఈ సినిమా రూపొందింది. అందుకే సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ శుభాకాంక్షలు అందించారు.   

మా నాన్న ధని ఏలే ఈ సినిమాకోసం నాకంటే ఎక్కువ కష్టపడ్డారు. అద్భుతమైన టీమ్‌ ఈ సినిమాకు పనిచేసింది. మహేంద్ర అద్భుతంగా తీశారు అని హీరో సూర్యతేజ ఏలే అన్నారు. భరతనాట్యం అద్బుతమైన ఎంటర్‌టైనర్‌ అని, ఎక్కడ కూడా కొత్త హీరో సినిమాలా ఉండదని, సినిమా మొదలైన ఐదు నిమిషాల తర్వాత అందరూ మరో ప్రపంచంలోకి వెళ్లిపోతారని, గొప్ప టీమ్‌ ఈ సినిమాకు పనిచేసిందని దర్శకుడు చెప్పారు. జీవితా రాజశేఖర్‌, హీరో నవదీప్‌, శివాత్మికతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులందరూ మాట్లాడారు.

Social Share Spread Message

Latest News