Namaste NRI

భీమా అవుట్‌ పుట్‌ అద్భుతంగా వచ్చింది : గోపీచంద్‌

గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భీమా. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయి కలు. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆరట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మించారు. ఈ నేపథ్యంలో హన్మకొండలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు ఏ హర్ష మాట్లాడుతూ భీమా  పేరు వింటేనే మాస్‌ ఎనర్జీ. భీమాలో పవర్‌ వుంది, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో మొదలుపెట్టాం. మీ అందరినీ వందశాతం ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. సినిమాకి కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు. రవి బస్రూర్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు  అని తెలిపారు .

నిర్మాత కేకే రాధామోహన్‌ మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కోసం అందరూ టీమ్‌గా పని చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాలో కామెడీ, యాక్షన్‌, ఎంటర్టైన్మెంట్‌ అన్ని అంశాలు ఉంటాయి . అందరూ థియేటర్స్‌లో చూసి ఆనందిస్తారని భావిస్తున్నాను అన్నారు . హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. భీమా అవుట్‌ పుట్‌ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్‌ చాలా బాగుంటుం ది . నేను సాధారణంగా ఇలా చెప్పాను… కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు. ఇంత బాగా సపోర్ట్‌ చేసిన నిర్మాత రాధామోహన్‌ గారికి ధన్యవాదాలు అన్నారు . ఈ వేడుకకు రఘు, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, రమణ లంక, కళ్యాణ్‌ చక్రవర్తితో పాటు మిగతా చిత్ర యూనిట్‌ సభ్యులంతా హాజరయ్యారు . మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events