కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 1920 భీమునిపట్నం. నరసింహ నంది దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి తీరంలో షూటింగ్ జరుగుతోంది. రాజమండ్రి, మునికొడవలి, పూడిపల్లి, దేవీ పట్నం, గండి పోచమ్మ గుడి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ సాతంత్య్ర పోరాట ఉద్యమ సమయం లో జరిగిన కొన్ని సంఘటలను ప్రేరణగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. హీరో ఉపేంద్ర బ్రిటీష్ ప్రభుత్వ పోలీస్ అధికారి పాత్రను, హీరోయిన్ అపర్ణాదేవి సాతంత్య్ర సమరయోధుడి పాత్రను పోషిస్తున్నారని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. ప్రస్తుతం గోదావరి తీరంలో షూటింగ్ జరుగుతోంది. సాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో సీతారామ్, సుజాత పాత్రల మధ్య నడిచే ప్రేమకథను దర్శకుడు అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాగారు అందించే సంగీతం మా చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఫొటోగ్రఫీ: ఎస్.మురళీమోహనరెడ్డి, సహ నిర్మాతలు: కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత.