హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నితిన్ మాట్లాడుతూ భీష్మ తర్వాత దర్శకుడు వెంకీతో నాకిది రెండో సినిమా. టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది అన్నారు. ఈ రాబిన్‌హుడ్ నిర్మాతలు పెట్టిన డబ్బుకి రెండింతల డబ్బుని వసూలు చేస్తాడని, భీష్మ సినిమా మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని చెప్పారు. చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ రాబిన్‌హుడ్ కాన్సెప్ట్ అనగానే పెద్దల సంపదను దోచి పేదలకు పంచిపెట్టే కథానాయకుడి పాత్రలే గుర్తుకొస్తాయి. కానీ ఈ సినిమా కథ అందుకు భిన్నంగా ఉంటుంది. క్రిస్మస్ సీజన్‌లో వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది అన్నారు.

ఈ సినిమా తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమని, ఇప్పటివరకు తనలోని డ్యాన్స్ టాలెంట్‌నే చూశారని, ఈ సినిమా తో యాక్టింగ్ టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం దక్కిందని కథానాయిక శ్రీలీల చెప్పింది. నితిన్ కెరీర్‌లో నే హయ్యెస్ట్ బడ్జెట్‌తో ఈ సినిమా తీశామని, అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, తప్పకుండా అందరికి నచ్చుతుందని చిత్ర నిర్మాతలు వై.రవిశంకర్, నవీన్ ఏర్నేని పేర్కొన్నారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
