మహా శివరాత్రికి వెండితెర శంకర్ దర్శనమిచ్చాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బోళా శంకర్ చిత్రంలో శంకర్ పాత్ర కనిపిస్తారు చిరంజీవి. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. శివరాత్రి సందర్భంగా బోళా శంకర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమన్నా కథానాయిక. ఫస్ట్‌లుక్‌ను వైబ్ ఆఫ్ భోళా పేరుతో విడుదల చేశారు. ఓ చేత్తో త్రిశూలంతో కూడిన కీచేన్ తిప్పుకొంటూ మోడ్రన్ లుక్‌లో జీపు బంపర్‌పై చిరు స్టైలిష్‌గా కూర్చున్న తీరు ఆకట్టుకుంది. అన్నాచెల్లెల అనుబంధంతో ముడిపడి ఉన్న కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. చిరు నుంచి ఆయన అభిమానులు కోరునే అన్ని అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాక్షన్‌కు, ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్నారు. డూడ్లీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.