Namaste NRI

భోళా శంకర్ టీజర్ వచ్చేసింది

మెగాస్టార్  చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్‌. తమన్నా కథానాయిక. మోహర్‌ రమేష్‌ దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ  చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి పాత్ర ఆద్యంతం సరదా పంచ్‌లు, యాక్షన్‌ హంగులతో ఆసక్తికరంగా సాగింది.కౌన్‌ హై తూ అంటే షికారుకు వచ్చిన షేర్‌ను బే, ఈ స్టేట్‌ డివైడ్‌ అయినా అందరూ నావాళ్లే..నాకు హద్దులు లేవు. సరిహద్దులు లేవు  అంటూ చిరంజీవి చెప్పిన సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి.

 ఈ సినిమాలో చిరంజీవి తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెప్పడం విశేషం. కీర్తి సురేష్‌, సుశాంత్‌, రఘుబాబు, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, సంగీతం: మహతి స్వరసాగర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏ.ఎస్‌.ప్రకాష్‌, సంభాషణలు: మామిడాల తిరుపతి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్‌ రమేష్‌. కాగా, భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events