Namaste NRI

భోళా శంకర్‌ ఫస్ట్ లిరికల్ వచ్చేస్తోంది

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్‌. తమన్నా కథానాయిక.   మోహర్‌ రమేష్‌ దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి గీతాన్ని ఈ నెల 4న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి స్టైలిష్‌ గా మోడరన్‌ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అన్నాచెల్లెలు సెంటిమెంట్‌ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుంది. ఈ నెలాఖరుకు షూటింగ్‌ మొత్తం పూర్తిచేస్తాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను మొదలుపెట్టాం అని చిత్రబృందం పేర్కొంది.

ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్‌ నటిస్తున్నది. సుశాంత్‌, రఘుబాబు, రావు రమేష్‌, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు. ఆగస్ట్‌ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.  ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, సంగీతం: మహతి స్వరసాగర్‌, సంభాషణలు: మామిడాల తిరుపతి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్‌ రమేష్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events