Namaste NRI

భోళాశంకర్ మెగా అప్‌ డేట్.. రిలీజ్‌ అప్పుడే

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోలా శంకర్  మూవీలో నటిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది.  ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఉగాది పండగని పురస్కరించుకొని భోళా శంకర్ మేకర్స్ మెగా అప్డేట్  ఇచ్చారు. ఆగస్ట్ 11, 2023న భోళా శంకర్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్‌లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో మెగా చిరంజీవి గ్రీన్ కుర్తా, షేడ్స్ లో హ్యాండ్సమ్ గా కనిపించగా, రాయల్ చైర్ లో కూర్చున కీర్తి సురేష్, తమన్నాలు ట్రెడిషనల్ వేర్ లో పండగ కళ ఉట్టిపడేలా అందంగా కనిపించారు. ఇప్పటికే విడుదలైన భోళా శంకర్  ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ  చిత్రంలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రగతి, తులసి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, శ్రీముఖి, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు.  ఇక ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తున్నారు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న చిత్రానికి డాన్స్ కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్.. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ లిరిక్స్ అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events