శివ కందుకూరి హీరోగా రూపొందిన చిత్రం బూతద్ధం భాస్కర్ నారాయణ. పురుషోత్తం రాజ్ దర్శకుడు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మాతలు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో సుహాస్‌తోపాటు దర్శకుడు విజయ్ కనకమేడల, వర్ష బొల్లమ్మ అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలో శివుడ్ని కీర్తిస్తూ సాగే ఓ గీతాన్ని లెజెండ్రీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చేతులమీదుగా విడుదల చేశారు. చైతన్యప్రసాద్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని శ్రీచరణ్ పాకాల స్వరపరచగా కాలభైరవ ఆలపించారని చిత్రబృందం తెలిపింది. ఈ శివ గీతం ఈ ఆల్బమ్‌లో నా ఫేవరెట్. కీలక సమయంలో ఈ పాట వస్తుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని హీరో శివ కందుకూరి నమ్మకం వ్యక్తం చేశారు. శివుడ్ని రావణాసురుడు ఎంత తీవ్రంగా పూజిస్తాడో, మా సినిమాలోని విలన్ కూడా అంత తీవ్రంగా పూజిస్తాడు. ఈ నేపథ్యంలో ఈ పాట ఉంటుంది అని దర్శకుడు చెప్పారు. మార్చి 1న సినిమా విడుదల కానుంది.