కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షుడు భువనేష్ బుజాల కలిశారు. ఇండియా పర్యటలో ఉన్న భువనేష్ బుజాల కిషన్ రెడ్డితో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులను కలువనున్నారు. 2022, జూలైలో నిర్వహించే 1-3 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో నిర్వహించే అమెరికా తెలుగు సంఘం 17వ మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భువనేష్ మాట్లాడుతూ తెలుగు కమ్యూనిటీకి అమెరికా తెలుగు సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కోవిడ్ టైమ్‌లో చేసిన ప్రత్యేక సహాయ కార్యక్రమాలను కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటా నాయకులు కూడా పాల్గొన్నారు.