Namaste NRI

అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ ప్రత్యర్థులుగా బైడెన్‌, ట్రంప్‌!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమతమ పార్టీల తరపున అధ్యక్ష పదవి బరిలో దిగేందుకు పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. భారీస్థాయిలో 16 రాష్ట్రాల్లో మంగళవారం ఒకేసారి జరిగిన ప్రైమరీ ఎన్నికలతో ఇది మరింత స్పష్టమయింది. విజేతలు ఎవరైనా ఆయా పార్టీల ప్రధాన అభ్యర్థులకు సంఖ్యాబలం దృష్ట్యా  ఇవి ఎంతో ముఖ్యమైనవి. అధ్యక్ష పదవికి అభ్యర్థులను బలపరచడంలోనే కాకుండా ఇతరత్రా కూడా ఇవి కీలకం. ఉత్తర కరోలినా, కాలిఫోర్నియా వంటి చోట్ల గవర్నర్లను ఇవి నిర్ణయించబోతున్నా యి. 2020 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడినవారే ఈసారి తుదిపోటీలో నిలబడకపోతే మేలనే భావన ఓటర్లలో కనిపిస్తున్నా అతి తప్పేలా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అమెరికాను మళ్లీ గొప్పదేశంగా చేద్దాం అనే నినాదాన్నే ట్రంప్‌ ఈసారీ వినిపిస్తారు. దానికి దీటుగా బైడెన్‌ ప్రచారం ఉంటుందని శ్వేతసౌధం ప్రతినిధి తెలిపారు. ట్రంప్‌ ఇప్పటికే డజనుమందికి పైగా ప్రధాన పోటీ దారుల్ని ఓడిరచారు.  ఇక నిక్కీ హేలీ ఒక్కరే మిగిలారు. నార్త్‌ కరోలినా రిపబ్లికన్‌ కాకస్‌ల ఎన్నికల్లోనూ ట్రంప్‌ విజయం సాధించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events