అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు లూసియానా ప్రెసిడెన్షియల్ ప్రైమరీ లోనూ విజయం సాధించారు. ఇప్పటికే వీరిద్దరు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల తరపున నవంబరులో జరగను న్న అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికకు నామినేషన్లను సాధించారు. మిసోరి ప్రెసిడెన్షియల్ డెమోక్రటిక్ ప్రైమరీ లోనూ బైడెన్ పోటీ చేశారు. ఈ ఫలితాలు వచ్చే వారం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బైడెన్, ట్రంప్ పార్టీల్లోని తమ ప్రత్యర్థులను ఓడిరచడంతో తాజా ప్రైమరీ ఎన్నికల్లో ఈ ఇరువురు నేతల గెలుపుపై ఎవరికీ అనుమానం లేదు.