Namaste NRI

దాడులు చేస్తే మాత్రం కఠిన ఆంక్షలు .. పుతిన్ కు బైడెన్ హెచ్చరిక

రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగొచ్చన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌తో ఫోన్లో సుధీర్ఘంగా సంభాషించారు.  60 నిమిషాల పాటు వీరిద్దరి సంభాషణ జరిగింది. ఈ విషయాన్ని వైట్‌హౌజ్‌ అధికారులు కూడా ధ్రువీకరించారు. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జో బైడెన్‌ తెగేసి చెప్పారని సమాచారం.  ఒక వేళ ఉక్రెయిన్‌పై రష్యా గనుక దాడికి దిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బైడెన్‌ తీవ్రంగా హెచ్చరించారు. మానవాళి కూడా తీవ్రంగా నష్టపోతుందని బైడెన్‌ ఈ సంభాషణలో అభిప్రాయపడ్డారు.

                ఉక్రెయిన్‌పై దాడులు చేస్తే మాత్రం తరువాత సంభవించే పరిణామాలకు కూడా సిద్ధంగానే ఉండాలని, ఎన్నడూ చూడని విధంగా ఆంక్షలుంటాయని బైడెన్‌ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలు కూడా విదిస్తామని, ఇందుకు అమెరికా, దాని మిత్రదేశాలు కూడా రెడీగా ఉన్నాయని బైడెన్‌ పుతిన్‌తో చెప్పారు.  ఇరు దేశాల మధ్య దౌత్యం నెరపడానికి అమెరికా, మిత్ర దేశాలు రెడీగానే ఉన్నాయని, కాదూ కూడదంటూ ఉక్రెయిన్‌పై దాడులు చేస్తే అంతే రీతిలో స్పందించడానికి కూడా సిద్దంగానే ఉన్నామని జోబైడెన్‌ పుతిన్‌తో చెప్పారని వైట్‌హౌజ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events