అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకున్న అధికారాలతో కుమారుడు హంటర్ బైడెన్ కు భారీ ఊరట కల్పించి న విషయం తెలిసిందే. తుపాకీ కొనుగోలు, పన్ను ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై దోషి గా తేలిన తన కుమారుడు హంటర్‌కు బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు. బైడెన్ నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించా రు. ఇది పూర్తిగా న్యాయవిరుద్ధమని, బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీవ్రంగా మండిపడ్డారు. హంటర్‌కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న జే-6 బందీలకు ఎందుకు ఉపశమనం కల్పించలేదు? కుమారుడి విషయంలో బైడెన్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా న్యాయవిరుద్ధం, అధికార దుర్వినియోగం అని ట్రంప్ పేర్కొన్నారు.