అమెరికా తయారు చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాపై వాడేందుకు కీవ్‌కు అనుమతిచ్చి బైడెన్ కార్యవర్గం ప్రమాదకర నిర్ణయం తీసుకున్నదని రష్యాలోని డ్యూమా సభ్యురాలు మారియా బూటినా అన్నారు. ఆ నిర్ణయా న్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నెట్టే చర్యగా అభివర్ణించారు. పదవిలో ఉన్నంత కాలం బైడెన్ కార్యవర్గం ఉద్రిక్తతలను గరిష్ఠస్థాయిలో రాజేస్తుందని, ట్రంప్ వచ్చాక ఈ నిర్ణయాలను ఉపసంహరించుకుం టారని ఆశిస్తున్నానని, మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడంలేదని ఆమె పేర్కొన్నారు.అమెరికాలో రష్యా ఏజెంటుగా పనిచేస్తోందనే ఆరోపణలపై బూటినాను జైల్లో పెట్టారు. దాదాపు 15 నెలలపాటు ఆమె జైల్లో గడిపారు. ప్రస్తుతం ఆమె యునైటెడ్ రష్యా పార్టీ తరఫున డ్యూమా సభ్యురాలిగా ఉన్నారు.