Skip to main content

Namaste NRI

జపాన్‌తో భారీ ఒప్పందం : డోనాల్డ్‌ ట్రంప్‌

జపాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. జపాన్‌ ఆర్థిక సాయంతో అమెరికాలో చేపట్టే మూడు ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు. వీటి విలువ 36 బిలియన్‌ డాలర్లు. జపాన్‌ సాయంతో టెక్సాస్‌లో చమురు ఎగుమతి కేంద్రం, జార్జియాలో కీలక ఖనిజాల ప్లాంట్‌, ఒహియోలో సహజ వాయువు విద్యుత్‌ ప్లాంటు ఏర్పడతాయి. ఒప్పందంలో భాగంగా అమెరికాలో జపాన్‌ 550 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడుతుంది. తొలి విడతగా ఈ మూడు ప్రాజెక్టులు చేపడతారు. జపాన్‌ పెట్టుబడులకు ప్రతిగా ఆ దేశంపై విధించిన సుంకాలను పదిహేను శాతానికి తగ్గిస్తామని ట్రంప్‌ తెలిపారు.

అమెరికాలో 550 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ సిద్ధపడింది. వీటిలో తొలి విడతగా అధికారికంగా 36 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో మూడు ప్రాజెక్టులు చేపట్టబోతోంది అని ట్రంప్‌ తెలిపారు. అమెరికా పారిశ్రామిక రంగానికి జవసత్వాలు కల్పించేందుకు ఈ చారిత్రక ఒప్పందం దోహదపడుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల పరిధి చాలా పెద్దదని, సుంకాలు అనే ప్రత్యేక మాట లేకుండా అవి సాధ్యపడవని వ్యాఖ్యానించారు. ఒప్పందం కుదరడానికి తన వాణిజ్య విధానాలే కారణమని చెప్పుకున్నారు.


Social Share Spread Message

Latest News