సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఊరట కల్పించింది. శ్రీలంకకు 2.9 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు అంగీకరించింది. 1948లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ద్వీప దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విదేశీ మారకద్రవ్యం కొరతతో ఇబ్బందులుపడుతున్నది. ఈ క్రమంలో 2.9 బిలియన్ డాలర్ల ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద 48 నెలల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ అంగీకారం తెలిపిందని శ్రీలంక అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 48 నెలల్లో ఈ రుణం అందనున్నది. శ్రీలంకలో స్థూల ఆర్థిక స్థిరత్వం, అదే సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షించడానికి రుణ సహాయం అందిస్తున్నట్లు పేర్కొంది.
