Namaste NRI

హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులకు బిగ్ షాక్

హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్‌ ప్రక్రియను ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులకు అమెరికన్‌ కాన్సులేట్ల నుంచి ప్రుడెన్షియల్లీ రివోక్డ్‌ ఈ-మెయిల్స్‌ వస్తున్నాయి. వీటి వల్ల ఇప్పటికే అమెరికాలో ఉంటున్న ఈ వీసా హోల్డర్లకు ఇబ్బంది ఉండదు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల దృష్టి లో గతంలో పడినవారికి ఇటువంటి ఈ-మెయిల్స్‌ వస్తున్నాయి. నేర నిర్ధారణ కానప్పటికీ వీటిని పంపిస్తున్నారు. చాలా సంఘటనల గురించి ఇంతకుముందు వీసా స్టాంప్స్‌లోనే వెల్లడించి, క్లియర్‌ చేసినప్పటికీ ఈ నోటీసులు వస్తున్నా యి. హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాలను తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ, అమెరికాలో చట్టబద్ధంగా నివసించడంపై ఎటువంటి ప్రభావం ఉండదు.అయితే, గతంలో పేర్కొన్న సమస్యను తదుపరి వీసా అపాయింట్‌మెంట్‌ సమయంలో మళ్లీ పునఃపరిశీలిస్తామని చెప్పడమే ఈ నోటీసుల అంతరార్థం.

హూస్టన్‌లోని ఇమిగ్రేషన్‌ లా ఫర్మ్‌ రెడ్డి న్యూమన్‌ బ్రౌన్‌ పీసీ తెలిపిన వివరాల ప్రకారం.. అర్హతకు సంబంధించిన సమస్యలు కనిపించినపుడు ప్రుడెన్షియల్‌ వీసా రివొకేషన్‌ను జారీ చేస్తారు. ఇది తుది నిర్ణయం తీసుకుని జారీ చేసేది కాదు. వీసా స్టేటస్‌ ఎక్స్‌పైర్‌ అయ్యే వరకు ఇటువంటివారు అమెరికాలో చట్టబద్ధంగా నివసించవచ్చు. అయితే, వీరు విదేశాలకు వెళ్లినట్లయితే, వీసా స్టాంప్‌ చెల్లుబాటు కొనసాగుతున్నప్పటికీ, తిరిగి అమెరికాలో ప్రవేశించేందుకు అవకాశం ఉండదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events