ఫేస్‌బుక్, గూగుల్‌కు ఫ్రాన్స్‌లో భారీ షాక్ తగిలింది. ఫేస్‌బుక్, గూగుల్‌కు కలిపి రూ.1,683 కోట్ల మేర జరిమానా విధించింది. ఫేస్‌బుక్ రూ.421 కోట్లు, గూగుల్ రూ.1,264 కోట్ల చొప్పున చెల్లించాలని ఆదేశించిది. ఆన్‌లైన్ ట్రాకింగ్‌ను వినియోగదారులు సులువుగా అంగీకరించే వెసులుబాటు కల్పించి, తిరస్కరించేందుకు కష్టతరంగా ఆప్షన్లు పెట్టడంపై మండిపడిరది. ఒక్క బటన్ నొక్కితే కుకీస్‌కు అంగీకరాం తెలిపేలా పెట్టి, అనేక క్లిక్ ల తర్వాతే అన్నింటినీ తిరస్కరించేలా ఆప్షన్లు పెట్టినట్టు తన విచారణలో తేలిందని సమాచార గోపత్యను కాపాడే సీఎన్‌ఐఎల్ వెల్లడిరచింది. కుకీలను అంగీకరిస్తే వెబ్‌సైట్‌లో డిజిటల్ ప్రకటనలు ఇచ్చేందుకు సంస్థకు అంగీకారం తెలిపినట్లే. మూడు నెలల్లో సులువుగా తిరస్కరించే వీలు కల్పించాలని, లేదంటే ఆ తర్వాతి నుంచి రోజుకు రూ.8.5 లక్షల జరిమానా విధిస్తామని సీఎస్‌ఐఎల్ హెచ్చరించింది.