Namaste NRI

బిగ్‌బాస్‌ అమరదీప్‌, సుప్రీత జంటగా కొత్త సినిమా ప్రారంభం

బిగ్‌బాస్‌ ఫేమ్‌ అమరదీప్‌ చౌదరి హీరోగా, నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ప్రారంభమైంది. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేంద్రనాధ్‌ కూండ్ల నిర్మిస్తు న్నారు. ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్‌నివ్వగా, ఏ.ఎం.రత్నం కెమెరా స్విఛాన్‌ చేశారు. రాజా రవీంద్ర, రూపాలక్ష్మి, వినోద్‌కుమార్‌ తదితరులు నటిస్తున్నారు.  భారతీయ సినిమాలో ఎవరూ టచ్‌ చేయని వినూత్న మైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతు న్నామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాల సరస్వతి, సంగీతం: దాస్‌ కడియాల, మాటలు: మరుధూరి రాజా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మల్యాద్రి రెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events