దివగంత మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు పాల్ అలెన్కి సంబంధించిన ఆర్ట్ సేకరణలను వేలం వేయనున్నట్లు క్రిస్టిస్ ప్రకటించింది. ఈ ఆర్ట్ విలువ సుమారు రూ.7 వేల కోట్లు పైనే ఉంటుందని పేర్కొంది. దాదాపు 150 కి పైగా ఆర్ట్ కలెక్షన్లను వేలం వేయనున్నట్లు తెలిపింది. ఇది 500 ఏళ్ల కళా చరిత్రలో అతిపెద్ద అత్యంత అసాధారణమైన ఆర్ట్ వేలంగా వెల్లడిరచింది. వీటిలో ఫ్రెంచ్ చిత్రాకారుడి పాల్ సెజాన్చే ఆర్ట్ లా మోంటాగ్నే సెయింట్ విక్టోయిర్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. దీని విలువ సుమారు రూ.650 కోట్లు ఉంటుందని వేలం సంస్థ వెల్లడిరచింది. వీటిని బిలియనీర్ ఆస్తులతో కలిపి ఈ వేలం వేస్తుందని తెలిపింది. అలెన్ కోరిక మేరకు వేలంగా వేయగా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తామని సంస్థ పేర్కొంది.