పాక్ ప్రధాని ఇమ్రాన్‌ను ఎలాగైనా గద్దె దింపాలని ప్రతిపక్షాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావవ్ భుట్టో అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 21న పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే సభ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ సమావేశాలను కూడా అడ్డుకుంటామని సంచలన ప్రకటన చేశారు. స్పీకర్ గనక ఈ నెల 21న అవిశ్వాస తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే విపక్ష నేతలందరమూ రోడ్లెక్కుతామని, నిరసనలను వ్యక్తం చేస్తామని బిలావ్ భుట్టో హెచ్చరించారు.
………………………