Skip to main content

Namaste NRI

చిక్కుల్లో బిల్ గేట్స్ కూతురు .. 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదా?

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కుమార్తె ఫోబీ గేట్స్ సహ-స్థాపించిన ఫియా షాపింగ్ స్టార్టప్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో వినియోగదారులకు డిస్కౌంట్ కూపన్లు అందించడం, తద్వారా వచ్చే అఫిలియేట్ కమిషన్‌ను పొందడం ఈ ఫియా బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ ప్రధాన ఉద్దేశం. అయితే, ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఈ యాప్ కుకీ స్టఫ్ఫింగ్ లేదా అట్రిబ్యూషన్ ఫ్రాడ్‌కు పాల్పడిందనే సంచలన నిజాలు వెలుగుచూశాయి. వినియోగదారులు ఫియా సహాయం తీసుకోకుండా ఇతర సైట్ల ద్వారా లేదా నేరుగా కొనుగోళ్లు చేసినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్‌లో సైలెంట్‌గా ఒక ట్యాబ్ ఓపెన్ చేసి అఫిలియేట్ కోడ్‌ను మార్చివేసేదని వెల్లడైంది. దీని ద్వారా తమకు సంబంధం లేని కొనుగోళ్లకు కూడా కమీషన్లను ఫియా తమ ఖాతాలో వేసుకుందనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ మోసం బయటపడటంతో ప్రధాన అఫిలియేట్ నెట్‌వర్క్ ఇంపాక్ట్.కామ్ ఫియా ఖాతాను సస్పెండ్ చేసింది. అయితే, కోడింగ్‌లో ఏర్పడిన ఒక చిన్న సాఫ్ట్‌వేర్ బగ్ వల్లే ఇలా జరిగిందని, ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే సరిదిద్దామని ఫియా సంస్థ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. కానీ, ఈ రకమైన కుకీ స్టఫ్ఫింగ్ ద్వారా ఇతరులకు రావాల్సిన కమీషన్లను దారి మళ్లించడం సైబర్ చట్టాల ప్రకారం తీవ్రమైన డిజిటల్ ఫ్రాడ్ కిందకు వస్తుంది. సంస్థ వ్యవస్థాపకులకు ఈ ఫీచర్ల గురించి ముందే తెలుసనే కథనాలు కూడా రావడంతో, ఇది తీవ్రమైన నేరపూరిత చర్యగా మారే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఫలితంగా ఫోబీ గేట్స్ అండ్ టీమ్ తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను మరియు విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది.

అమెరికాలో ఇలాంటి చర్యలు ఫెడరల్ వైర్ ఫ్రాడ్ కింద పరిగణించే అవకాశం ఉందని గివ్నర్ లా వ్యవస్థాపకురాలు, న్యాయవాది ఏరియల్ గివ్నర్ పేర్కొన్నారు. ఆరోపణలు నిరూపితమైతే గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాలు, నష్టపరిహారం వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

Social Share Spread Message

Latest News