
భారత్‌కు చెందిన బిలియనీర్, ఉక్కు తయారీ రంగ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్ బ్రిటన్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 3 దశాబ్దాలుగా బ్రిటన్ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఉంటున్న మిట్టల్‌కు, పన్నులకు సంబంధించి అక్కడి ప్రభుత్వ నిర్ణయం సెగ తగులుతున్నది. దీంతో దుబాయ్, స్విట్జర్లాండ్, ఇటలీలకు వెళ్లిపోవాలని మిట్టల్ యోచిస్తున్నట్టు సమాచారం. అక్కడ సంపన్నులకు పన్ను ప్రోత్సాహకాలున్నాయి. కాగా, బ్రిటన్‌లో ఉన్నప్పటికీ వారి శాశ్వత నివాసం ఇతర దేశాల్లో ఉంటే, విదేశీ ఆదాయంపై బ్రిటన్‌లో వారు పన్నులు కట్టనక్కర్లేదు. అయితే దీన్ని వచ్చే నెల నుంచి రద్దు చేస్తున్నట్టు బ్రిటన్ సర్కారు ప్రకటించింది. ఫలితంగా మిట్టల్‌పై పన్ను భారం తప్పేట్లు లేదు.
