Skip to main content

Namaste NRI

పుతిన్‌పై బయోపిక్‌ .. ట్రైలర్‌ను విడుదల  

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ జీవితంపై ఒక బయోపిక్‌ తెరకెక్కింది. పోలాండ్‌కు చెందిన డైరెక్టర్‌ బెసలీల్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు పుతిన్‌ అని పేరు పెట్టారు. ఇప్పటికే 2.5 నిమిషాల ట్రైలర్‌ను విడుదల చేశారు. పుతిన్‌కు సంబంధించిన ఆరు దశాబ్దాల జీవితంలోని అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారట. చిత్రాన్ని సైకలాజికల్‌ థ్రిల్లర్‌ గా పేర్కొనడం గమనార్హం. పుతిన్‌ పాత్రను కృత్రిమ మేథ (ఏఐ) ద్వారా సృష్టించారు. రష్యా, ఉక్రెయిన్‌, సిరియా, జోర్డాన్‌, పోలాండ్‌లో చిత్రీకరించారు.సెప్టెంబర్‌ 26న సినిమాను రిలీజ్‌ చేయనున్నారు.

Social Share Spread Message

Latest News