
ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం బైసన్. మారి సెల్వరాజ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న జగదంబే ఫిల్మ్స్ నిర్మాత బాలాజీ ఉభయ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రా అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కించారని, తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు. ఓ క్రీడాకారుడి జీవితం ఆధారంగా వాస్తవికతకు పెద్దపీట వేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్, పశుపతి, కలైయరసన్, రెజీషా విజయన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: నివాస్ కే ప్రసన్న, నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా రంజిత్, అదితి ఆనంద్, దర్శకత్వం: మారి సెల్వరాజ్.
















