Skip to main content

Namaste NRI

బీజేపీ నేత పాతూరి నాగభూషణంకు ప్రతిష్టాత్మక అవార్డు

బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్‌చార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణానికి  అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అందించే విశిష్ట పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. వ్యవసాయ రంగంలో పాతూరి నాగభూషణం చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం లభించినట్లు తానా సభ్యులు మీడియాకు వెల్లడించారు. తనకు తానా అవార్డు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  జులై 3వ తేదీన తానా 24వ మహాసభల్లో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు.  ఈ క్రమంలో పాతూరి నాగభూషణం ఈ అవార్డును అందుకోవడం కోసం అమెరికా వెళ్లారు.

Social Share Spread Message

Latest News