బీజేపీ ముక్త్ భారత్ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రియా శాఖ వ్యవస్థాపకుడు మేడిపల్లి వివేక్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించడం పట్ల ఆస్ట్రియా శాఖ కార్యవర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా వివేక్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రగతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పడం శుభపరిణామని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ వంటి గొప్ప విజన్ కలిగిన నేత దేశానికి ఎంతో అవసరమున్నదని వెల్లడిరచారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, పేదలకు అందుతున్న సంక్షేమ ఫలాలపై దేశమంతా చర్చిస్తున్నదని పేర్కొన్నారు. మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్లకు కోట్లు తెచ్చేలా, పేదలు ఆకలితో మగ్గేలా ఉన్నారని ఆరోపించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)