Skip to main content

Namaste NRI

బాక్సాఫీస్ బద్దలు.. రీరిలీజ్ కాబోతున్న బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, వారాహి చలన చిత్ర పతాకాలపై అనిల్‌ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 30న రీరిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా రీరిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్నందించారు. ప్రస్తుతం బాలకృష్ణ…బాబీ దర్శకత్వం లో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News