Namaste NRI

రోషన్ కు బ్లాక్ బస్టర్ స్టార్ట్ అవుతుంది : నాని

రాజీవ్‌కనకాల, సుమ కనకాల తనయుడు రోషన్‌ కనకాల హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం బబుల్‌గమ్‌. మానస చౌదరి కథానాయిక. రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో నాని విడుదల చేశారు. నాని మాట్లాడుతూ రోషన్‌ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. టీజర్‌ చూస్తేనే అర్థమైపోతుంది. తొలిసినిమానే ఇంత ఈజ్‌తో చేయడం చిన్నవిషయం కాదు. టీజర్‌ని బట్టి చూస్తే చాలా బలమైన కంటెంట్‌తో తీసిన సినిమాలా అనిపిస్తుంది. రోషన్‌ పెద్దహీరో అయి, అమ్మానాన్న పేర్లు నిలబెట్టాలి అని అన్నారు. మరో సక్సెస్‌ఫుల్‌ హీరో తెలుగు చిత్రపరిశ్రమకు వచ్చాడని టీజర్‌ చూశాక అనిపిస్తున్నది. మానస, రోషన్‌ల స్క్రీన్‌ ప్రెజన్స్‌ బావుంది. కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.  దర్శకుడు రవికాంత్‌ క్లారిటీ ఉన్న దర్శకుడు. తన కంటూ ఓ సంతకం ఉంటుంది. అది టీజర్‌లో కనిపించింది. డిసెంబర్‌ 29న విడుదల కానున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అన్నారు.

సపోర్ట్‌ చేసిన అందరికీ హీరో రోషన్‌ కృతజ్ఞతలు తెలియజేశాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం, ప్రేక్షకుల అండదండలు తనకుంటాయని నమ్ముతున్నానని రోషన్‌ అన్నారు. రోషన్‌, మానస చాలా గ్రేస్‌తో తమ పాత్రలని పోషించారనీ, అందరికీ మంచి పేరుతెచ్చే సినిమా అవుతుందని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్‌ సభ్యులంతా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్‌ రగుతు, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events