రాజకీయాల్లో ఉన్న వారి కుటుంబాలను, వారి పిల్లలను రాజకీయాల్లోకి లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాన్ తీన్మార్ మల్లన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న వాడిన భాష కించపరిచే విధంగా ఉన్నదన్నారు. బాడీ షేమింగ్ చేయడం సరికాదన్నారు. ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యల విషయంలో రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేటీఆర్ కుటుంబానికి తీన్మార్ మల్లన్న బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఇలాంటి చవకబారు వ్యాఖ్యలకు దిగుతున్నారని, దీనిని బీజేపీ నేతలు చూస్తూ కూర్చోవడం ఆక్షేపణీయమన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)