Namaste NRI

వాల్తేరు వీరయ్యలో బాలీవుడ్‌ భామా స్పెషల్‌ సాంగ్‌

చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రాన్ని బాబీ ( కేఎస్‌ రవీంద్ర) డైరెక్ట్‌ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ ఓ కీలక పాత్రలో నటించారు.  ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ టీజర్‌ చిరులోని మాస్‌ అవతార్‌ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ చిత్రం ఊరమాస్‌ వినోదం అందించడం పక్కా అని టీజర్‌తో తెలిసిపోతుంది. కాగా ఇపుడీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్‌ చేస్తోంది. బాలీవుడ్‌ భామా ఊర్వశీ రౌటేలా  వాల్తేరు వీరయ్యతో కలిసి చిందులేయబోతుందట.  ఇప్పుడు చిరు`ఊర్వశిపై హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ సెట్‌లో ఓ ప్రత్యేక గీతం చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఇది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచే పాట. ఈ గీతానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించగా, శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు అని చిత్ర వర్గాలు తెలిపాయి.  మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events