Namaste NRI

బాలీవుడ్‌ హిట్‌ మూవీ ఛావా.. తెలుగు ట్రైలర్ రిలీజ్

ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా రూపొంది. బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఛావా చిత్రం తెలుగు వెర్షన్‌ ఈ నెల 7న తెలుగు రాష్ర్టాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో విక్కీకౌశల్‌ నట విశ్వరూపం చూపించిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ మరణం తర్వాత,  మొఘల్‌ ఆధిపత్య ముప్పును మరాఠా సామ్రాజ్యం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తినప్పుడు,  శివాజీ వారసత్వం ఛత్రపతి శంభాజీ ద్వారా కొనసాగుతుంది.

సింహం పోవచ్చు,  కానీ దాని పిల్ల ఇప్పటికీ అడవిలో వేటాడుతూనే ఉంది అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో శంభాజీ పాత్రని తెలుగు ప్రేక్షకులకు ట్రైలర్‌ ద్వారా పరిచయం చేశారు. శత్రువుల శక్తిసామర్థ్యాలు,  గెరిల్లా యుద్ధాలు,  శంభాజీ ధైర్యసాహసాలు, మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు కుయుక్తలు, ఈ ట్రైలర్‌లో చూడొచ్చు. ఔరంగజేబుగా అక్షయ్‌ఖన్నా, శంభాజీ ఇల్లాలు యేసుబాయిగా రష్మిక మందన్నా ఈ ట్రైలర్‌లో అలరించారు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్విస్తున్నామని, భాష ఏదైనా అది మంచి సినిమా అయితే దాన్ని తెలుగులోకి తీసుకురావడానికి గీతా ఆర్ట్స్‌ ఎప్పుడూ ముందే ఉంటుందని, ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని నిర్మాత బన్నీ వాసు నమ్మకం వెలిబుచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events