Namaste NRI

ఆస్ట్రేలియాలో ఘనంగా బోనాల జాతర

 ఆస్ట్రేలియాలో ఘనంగా  బోనాల జాతర నిర్వహించారు. మెల్‌బోర్న్‌ నగరంలో రాక్బ్యాంక్ దుర్గ మాత టెంపుల్‌లో మెల్‌బోర్న్‌ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిపారు. పోతురాజుల ఆట, పాటలు, యువకుల నృత్యాలతో దుర్గా మాత ఆలయంలో ఎంతో సందడి చేసారు. తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ వారికి బోనాలు, తొట్టెల సమర్పించుకుని తమ మొక్కును చెల్లించుకున్నారు.

భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రజలు  బోనాల పాటలకు చేసిన నృత్యాలు,  నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  మెల్‌బోర్న్‌ బోనాలు సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు, రాజు వేముల, దీపక్ గద్దె, ప్రజీత్ రెడ్డి కోతిలను ఈ వేడుకలకు హాజరైన వివిధ సంఘాల నాయకులు అభినందించారు.

Social Share Spread Message

Latest News