Skip to main content

Namaste NRI

బ్రిటిష్‌ రచయిత హారిసన్‌ను వరించిన బుకర్‌ ప్రైజ్‌

బ్రిటిష్‌ రచయిత ఎం జాన్‌ హారిసన్‌ బుకర్‌ ప్రైజ్‌ 2026ను గెల్చుకున్నారు. ఆయన రాసిన ద ఎండ్‌ ఆఫ్‌ ఎవిరిథింగ్‌ నవలకు ఈ బహుమతి లభించింది. 81 ఏండ్ల వయసులో కల్పిత సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలలో ఒకదాన్ని అందుకున్న అత్యంత వృద్ధ రచయితగా ఆయన నిలిచారు.లండన్‌లోని ఓల్డ్‌బిల్డింగ్స్‌గేట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో విజేతను ప్రకటించారు.

ప్రైజ్‌మనీ కింద హారిసన్‌ 67 వేల డాలర్లను అందుకుంటారు. ఈ విజయం బుకర్‌ ప్రైజ్‌ చరిత్రలో సైన్స్‌ ఫిక్షన్‌కు లభించిన అరుదైన గౌరవంగా నిలుస్తుంది. హారిసన్‌ గత ఐదు దశాబ్దాలకు పైగా ఈ ప్రక్రియలోనే రచనలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events