ప్రముఖ బ్రిటిష్ రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత హిలరీ మాంటెల్ (70) మరణించారు. 2009లో ప్రచురితమైన వోల్ఫ్ ట్రయాలజీలో భాగంగా మరో మూడేండ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ బ్రింగ్ ఆప్ ది బాడీస్ పుస్తకాలను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్‌ను హిలరీ దక్కించుకున్నారు. ఈ రెండు పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 50 లక్షల కాపీలకు పైగా అమ్ముడయ్యాయి. ఈ సిరీస్‌లో చివరిదైన ది మిర్రర్ అండ్ ది లైట్ మార్చి 2020లో ప్రచురితమైంది. మాంటెల్ తొలుత సోషల్ వర్కర్‌గా సేవలందించారు. బోత్స్యానాలో తన భర్త గెరాల్డ్ మెక్‌వెన్‌తో నివసించే సమయంలో ఆమె ఫిక్షన్ రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. మాంటెల్ ఆపై సౌదీ అరేబియాలో నాలుగేండ్లు ఉన్న తర్వాత 1980 ప్రాంతాల్లో తిరిగి బ్రిటన్ చేరుకున్నారు. 1985లో ఆమె తొలి నవల ఎవిరిడే మదర్స్‌డే ప్రచురితమవగా, మొత్తం 17 పుస్తకాలను రచించారు.
