Skip to main content

Namaste NRI

విక్టరీ వెంకటేష్ చేతుల మీదగా బూమరాంగ్  ఫస్ట్ లుక్ లాంచ్

అను ఇమ్మాన్యుయేల్‌, శివ కందుకూరి లీడ్‌రోల్స్‌లో నటిస్తున్న థ్రిల్లర్‌ మూవీ బూమరాంగ్‌. సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లండన్‌ గణేశ్‌, డా.ప్రవీణ్‌రెడ్డి వూట్ల నిర్మాతలు. ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని అగ్రహీరో వెంకటేష్‌ ఆవిష్కరించారు. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో రెండు సమాంతర కథాంశాలతో ఉత్కంఠను కలిగించే థ్రిల్లర్‌గా సినిమా ఉంటుందని, తలకు గాయమై రక్తం కారుతుండగా, షాక్‌ స్థితిలో ఉన్న అను ఇమ్మాన్యుయేల్‌ను ఈ పోస్టర్‌లో చూడొచ్చు. కాళరాత్రి నిర్జీవంగా పడున్న శరీరాలు  వీటిమధ్య నల్లని కుక్కతో నడుచుకుంటూ వస్తున్న ఓ వ్యక్తి,  ఇలాంటి భయంకరమైన వాతావరణం ఈ పోస్టర్‌ ఉన్నది. అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇదని, ఆండ్రూ బాబు దర్శకత్వం, సినిమాటోగ్రఫీ హైలైట్స్‌గా నిలుస్తాయని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, నిర్మాణం: బిగ్‌ మూవీ మేకర్స్‌ లిమిటెడ్‌ అండ్‌ మై3 ఆర్ట్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events