Skip to main content

Namaste NRI

బూట్‌కట్‌ బాలరాజు రాక అప్పుడే

సోహైల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం బూట్‌కట్‌ బాలరాజు. శ్రీ కోనేటి దర్శకుడు. ఎం.డీ.పాషా నిర్మిస్తున్నారు. మేఘలేఖ, సునీల్‌, సిరి హన్మంత్‌, ఇంద్రజ, అవినాష్‌ తదితరులు నటిస్తున్నారు.  దర్శకుడు మాట్లాడుతూ ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తున్నది. భీమ్స్‌ సిసిరో లియో స్వరపరచిన పాటలు శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిం చాం. ఆద్యంతం వినోదంతో మెప్పిస్తుంది అన్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేయబోతు న్నట్లు నిర్మాతలు తెలిపారు.  ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ కే నాయుడు, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కథ: లక్కీ మీడియా యూనిట్‌, రచన-దర్శకత్వం: శ్రీకోనేటి.

Social Share Spread Message

Latest News