ఇంకోర్ గ్రూప్ ఇంక్యుబేషన్ వెంచర్ బోస్టన్ లివింగ్, జీఎంఆర్ హైదరాబాద్ ఏరోసిటీతో జట్టు కట్టింది. రూ.250 కోట్ల పెట్టుబడితో ఏరోసిటీ వద్ద కో`లివింగ్ ప్రాజెక్టును బోస్టన్ లివింగ్ అభివృద్ధి చేయన్నుది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య తాజాగా అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం జీఎంఆర్ ఏరోసిటీ 5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని బోస్టన్ లివింగ్‌కు లీజుకు ఇవ్వనున్నది. ఈ ప్రాజెక్టు కింద దశలవారీగా ఇక్కడ 1,500 బెడ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు ద ల్యాండిరగ్ బై బోస్టన్ లివింగ్ అని పేరు పెట్టారు. ఇప్పటికే కొండాపూర్‌లో 500 బెడ్లతో కో`విలింగ్ సౌకర్యాన్ని ఈ సంస్థ అందిస్తున్నది. ఇది దేశంలోని అది పెద్ద సింగిల్ లొకేషన్ కో`లివింగ్ సదుపాయాల్లో ఒకటిగా ఉండటం విశేషం.