ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటన ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు మెడిసిన్ విభాగంలో అమెరికా సైంటిస్టులు డేవిడ్ జులియస్, ఆర్డెమ్ పాటాపౌటియన్‌లు నోబెల్ గెలుచుకున్నారు. విజేతలకు నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్ థామస్ పెర్ల్‌మాన్ ప్రకటించారు. ఉష్ణోగ్రత, స్పర్శకు సంబంధించి గ్రాహకాలకు కనుగొన్నందుకుగాను వీళ్లను నోబెల్ వరించింది. మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం ఎలా ఉంటున్నామన్న దానితో పాటు మన మనుగడకు ఉష్ణం, చల్లదనం, స్పర్శను గుర్తించే మన సామర్థ్యం కీలకం. మన నిత్య జీవితంలో వీటిని మనం తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి మన నరాల ప్రేరణలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నకు పరిష్కారాన్ని ఈ ఏడాది నోబెల్ బహుమతి గ్రహీతలు చూపించారు అని నోబెల్ జ్యూరీ ఓ ప్రకటనలో వెల్లడిరచింది.