రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్పెషల్ సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. బ్రహ్మానందం మంచి నటుడే కాదు మంచి పెయింటర్. కొద్దిరోజులుగా అనేక చిత్రాలను గీసి, సన్నిహితులకు ప్రదానం చేస్తున్నారు. కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన బ్రహ్మానందం కొంతసమయం సరదాగా మాట్లాడారు. అనంతరం తాను గీసిన సాయిబాబా చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. ఈ స్పెషల్ సర్‌ఫ్రైజ్ పట్ల కృష్ణంరాజు ఎంతో సంతోషం వ్యక్తంచేశారు. ట్విటర్ వేదికగా ఫొటోలు షేర్ చేశారు. మన కామెడీ జీనియస్ ఆర్ట్‌లోనూ జీనియస్సే. అద్భుతమైన టాలెంట్ కలిగిన మంచి వ్యక్తి మన బ్రహ్మానందం. థ్యాంక్యూ ఫర్ ది స్పెషల్ సర్‌ప్రైజ్ అని పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)