రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా భారీ పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో దీనిని బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నీరు, గాలి, నిప్పు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకొని ఉందని విషయం ఈ యువకుడికే తెలియదు అతనే శివ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్‌తో బ్రహ్మాస్త్రం ట్రైలర్ విడుదలైంది. మెగాస్టార్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టారైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మకమైన సినిమా సెప్టెంబర్ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్‌చేయనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎస్.ఎస్.రామజౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.














