ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ పాత్రలో రూపొందుతున్న చిత్రం బ్రేక్ అవుట్. సుబ్బు చెరుకూరి దర్శకుడు. అనిల్ మోదుగ నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో అల్లు అర్జున్ విడుదల చేశారు. దర్శకుడు సర్వైవల్ థ్రిల్లర్‌గా పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమది. మోనోఫోబియా అనే మానసిక రుగ్మత వున్న హీరో అనుకోని పరిస్థితుల్లో వంటగది గ్యారేజ్‌లో చిక్కుకుపోతాడు. ఈ ఫోబియా వున్న వారికి ఒంటరిగా గడటం అంటే తీవ్ర ఆందోళనకరంగా వుంటుంది. ఆ గ్యారేజ్ నుండి హీరో ఎలా బయటపడ్డారు అనేది ఎంతో ఆసక్తికరంగా వుంటుంది అన్నారు. రాజా గౌతమ్ నటన, జోన్స్ రూపర్ట్ నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంటున్నాయి సినీవర్గాలు. చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి కీలక పాత్రలు పోషించారు. ఛాయాగ్రహణం మోహరి చారి. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
