భారతదేశం అధ్యక్షతన 13వ బ్రిక్స్ సదస్సు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 9న వర్చువల్ విధానంలో సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. 2012 తర్వాత బ్రిక్స్ శిఖరాగ్రానికి భారత్ అతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. ఈ సమావేశానికి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా హాజరవుతారు. బ్రిక్స్ న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి) లో కొత్త సభ్యులుగా బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఈ) ఊరుగ్వేలను కూడా ఆతిథ్య దేశం స్వాగతించింది. ఈ సదస్సుకు కొనసాగింపు, ఏకీకరణ ఏకాభిప్రాయం ఇతివృత్తంగా పేర్కొనబడిరది.